71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, విక్రాంత్ మెస్సీ, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ

కేంద్ర ప్రభుత్వం 2025 జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్‌ మురుగన్‌కు జ్యూరీ అందజేసింది.

కేంద్ర ప్రభుత్వం 2025 జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్‌ మురుగన్‌కు జ్యూరీ అందజేసింది. అనంతరం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మీడియా సమావేశంలో ప్రధాన విభాగాల విజేతల వివరాలను జ్యూరీ సభ్యులు వెల్లడించారు.

అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్‌ కేసరి” కి అవార్డు దక్కింది. హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ నందు, పృథ్వీ. బలగం సినిమాలోని “ఊరు పల్లెటూరు” సాంగ్‌కు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్.

ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్))
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు
ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్ – హనుమాన్

—-

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మెస్సీ (12th ఫెయిల్), ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (Mrs ఛటర్జీ వర్సెస్ నార్వే) అవార్డులు దక్కించుకున్నారు.

—-

ఇతర భాషల సినిమాలకు

ఉత్తమ తమిళ చిత్రం (ఫీచర్): పార్కింగ్ – రామ్‌కుమార్ బాలకృష్ణన్ (దర్శకుడు)

ఉత్తమ తెలుగు చిత్రం (ఫీచర్): భగవంత్ కేసరి – అనిల్ రవిపూడి (దర్శకుడు)

ఉత్తమ గారో సినిమా: రిమ్డోగిట్టంగా (రాప్చర్)
(గారో – ఈశాన్య భారతదేశంలోని గారో భాషలో తీసిన సినిమా)

ఉత్తమ తాయ్ ఫేక్ సినిమా: పై టాంగ్: స్టెప్ ఆఫ్ హోప్

ఫీచర్ ఫిల్మ్ విభాగంలో స్పెషల్ మెన్షన్: యానిమల్

ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం: ది ఫ్లవరింగ్ మాన్ (హిందీ)

ఉత్తమ కళల/సాంస్కృతిక చిత్రం: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)

ఉత్తమ మేకప్ – ‘సామ్ బహదూర్’

ఉత్తమ సంగీత దర్శకత్వం – ‘వాతి’, ‘యానిమల్’ – GV ప్రకాష్ కుమార్, హర్షవర్ధన్ రామేశ్వర్

ఉత్తమ కొరియోగ్రఫీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ లోని ‘ధింధోరా బజే రె’ (హిందీ)- వైభవి మర్చంట్

ఉత్తమ అస్సామీ (ఫీచర్) సినిమా – ‘రొంగటపు’

ఉత్తమ బెంగాలీ (ఫీచర్) సినిమా – ‘డీప్ ఫ్రిడ్జ్’

ఉత్తమ గుజరాతీ (ఫీచర్) సినిమా – ‘వష్’

ఉత్తమ హిందీ సినిమా – యశోవర్ధన్ మిశ్రా దర్శకత్వం వహించిన ‘కథల్’

ఉత్తమ కన్నడ (ఫీచర్) సినిమా – కె.యశోదా ప్రకాష్ దర్శకత్వం వహించిన ‘కందీలు’

నాన్-ఫీచర్ విభాగం విజేతలు

ఉత్తమ డాక్యుమెంటరీ (నాన్-ఫీచర్): గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)

ఉత్తమ స్క్రిప్ట్ (నాన్-ఫీచర్): సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)

ఉత్తమ వాయిస్ ఓవర్ / నరేషన్: ది స్కేడ్ జాక్ – ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విశెస్ (ఇంగ్లీష్)

ఉత్తమ దర్శకత్వం (నాన్-ఫీచర్): పీయూష్ ఠాకూర్ – ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

స్పెషల్ మెన్షన్స్‌

నేకల్ – క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మాన్ (మలయాళం) – ఎమ్‌కే రమదాస్

ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా) – హిమాంశు శేఖర్ కటువా, కదంబినీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్

ఉత్పల్ దత్త – ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు (అసామీ)