మెరుపులా వచ్చాడు.. స్టార్స్‌ను దాటేసి సౌత్ ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు!

సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ తారలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది.

తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విజయ్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా 8 మిలియన్ల మార్క్ దాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా కూడా విజయ్ రేర్ ఫీట్ సాధించడం విశేషం. విజయ్ తర్వాత అల్లు అర్జున్ (7.6 మిలియన్స్), మహేష్ బాబు (5.2 మిలియన్స్), ప్రభాస్ (4.8 మిలియన్స్), రానా (4 మిలియన్స్) ఫాలోయర్స్ కలిగి ఉన్నారు. వీరందరి కంటే కూడా విజయ్‌కే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండడం చూస్తుంటే యూత్‌లో అతని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.