9 Hours web Series: డైరెక్టర్ క్రిష్ షో రన్నర్‌గా 9 అవర్స్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.
- Naresh Mannam
- Published On : May 12, 2022 / 07:45 PM IST
9 Hours Web Series
9 Hours web Series: వెండితెరపై చెప్పలేని కొన్ని కథల్ని ప్రేక్షకులకు చూపించడానికి వెబ్ సిరీస్ లు ఇప్పుడు చక్కటి మార్గంగా మారిపోయాయి. ఈ వెబ్‌సిరీస్ లకు ఆదరణ పెరుగుతుండటంతో అగ్ర దర్శకులు వీటిని తెరకెక్కించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్ ఓ వెబ్‌సిరీస్‌కు కథను అందిస్తున్నారు. ఆయనే షో రన్నర్ గా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!
సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు వ్యూయర్స్ కు సిద్ధం చేస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు.
Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు బ్యాంక్ లోకి ఎలా చొరబడారు. అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా, ఇంతలో పోలీస్ తీసుకున్న చర్యలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
