Oscars 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు..

వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే భారతదేశంలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. అందుకు కారణం..

95th oscar awards function is be live streaming in disney plus hotstar

Oscars 2023 : వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే భారతదేశంలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. అందుకు కారణం వరల్డ్స్ బ్లాక్ బస్టర్ మూవీ RRR చిత్రం ఆస్కార్ బరిలో నిలవడం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకొని ఇంటర్నేషనల్ ఫిలింగా నిలిచింది. ఇంతటి హిట్ సాధించిన ఈ సినిమా ఆస్కార్ కి ప్రభుత్వం తరుపునుంచి ఎంపిక అవుతుంది అని అందరూ అనుకున్నారు.

Rajamouli : RRR సినిమాలో హీరోలేనా.. వాళ్ళని కూడా పట్టించుకోండి.. అభిమానుల ఆవేదన..

కానీ భారత్ ప్రభుత్వం ఎంపిక చేయపోవడంతో, సొంతంగా ఆస్కార్ నామినేషన్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ రేస్ లో పోటీ పడుతుంది. ఇక ఈ సినిమా పై హాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ, RRR ఆస్కార్ గెలవాలి అంటూ కోరుకుంటున్న హాలీవుడ్ ఆడియన్స్ ని చూసి.. ఇండియన్ ఆడియన్స్ లో RRR ఆస్కార్ గెలుస్తుందా? లేదా? అనే క్యూరియాసిటీ మొదలైంది. దీంతో అమెరికాలో RRR టీం ఆస్కార్ కోసం చేస్తున్న ప్రతి క్యాంపెన్ పై ప్రత్యేక ద్రుష్టి పెడుతూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే మార్చి 12న జరగబోయే ఆస్కార్ అవార్డుల పురస్కారం ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు అని సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ ఆసక్తిని గమనించిన ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్దమయ్యింది. 95వ ఆస్కార్ అవార్డులను ఇండియన్ టైం ప్రకారం మార్చి 13న ఉదయం గం. 5:30 నిముషాలు నుంచి ప్రసారం చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. కాగా ఆస్కార్ అవార్డుల వేడుక పై నాటు నాటు సాంగ్ ని సింగర్స్ కార్తికేయ, రాహుల్ సిప్లిగుంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ అండ్ చరణ్ లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.