Mammootty-Dulquer Salmaan : శివరాత్రికి తండ్రీ కొడుకులు ‘ఢీ’..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ సినిమాలు 2022 శివరాత్రి కానుకగా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి..

Mammootty

Mammootty-Dulquer Salmaan: పాండమిక్ తర్వాత ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అన్ని భాషలకు సంబంధించి సినిమాల విడుదల విషయంలో భారీ పోటీ నెలకొంటుంది. షూటింగ్ దశలో ఉండగానే డేట్ ఫిక్స్ చేసుకున్నవి, అప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలు ఇక అందులోనూ పెద్ద సినిమాల మధ్య అయితే విపరీతమైన డేట్స్ క్లాష్ తప్పడం లేదు.

Radhe Shyam : ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా ట్రాఫిక్ జామ్..

పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా సినిమాలు కూడా వాయిదా వేసుకోక తప్పలేదు. టాలీవుడ్, బాలీవుడ్‌ మేకర్స్ చర్చించుకుని ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాలకు దారిచ్చారు. ఇక మలయాళంలో ఓ సీనియర్ స్టార్ అలాగే ఓ యంగ్ స్టార్ హీరో మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ సినిమాలు 2022 శివరాత్రి కానుకగా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. దీంతో మలయాళం ఇండస్ట్రీలో తండ్రీ కొడుకుల సినిమా రిలీజ్ డేట్స్ గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

 

అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’ ఫిబ్రవరి 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 25న దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి కాంబినేషన్‌లో బృంద డైరెక్ట్ చేస్తున్న ‘హే! సినామిక’ విడుదల కాబోతుంది. ఒక్క రోజు తేడాతో తండ్రీ కొడుకులిద్దరూ బాక్సాఫీస్ బరిలో సందడి చెయ్యబోతుండడంతో ఇరు హీరోల అభిమానులు ఫుల్ జోష్‌తో ఉన్నారు.

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!