A contestant remove his shirt in Kaun Banega Crorepati and danced on stage
Kaun Banega Crorepati : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న ఫేమస్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి. ఇటీవలే ఈ షో 14వ సీజన్ మొదలైంది. అయితే తాజా ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కౌన్ బనేగా క్రోర్‌పతి షోలోకి ఎంటర్ అయ్యేందుకు నిర్వహించే ఫాస్టేస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే రౌండ్‌లో గెలుపొందిన ఓ వ్యక్తి షర్డ్ విప్పి స్టేజ్‌పై అమితాబ్, ఆడియన్స్ ముందు హంగామా చేశాడు. తాజాగా షో నుంచి ఈ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఈ వీడియోలో అమితాబ్.. విజయ్ గుప్తా అనే ఓ 40 ఏళ్ళకి పైనే ఉండే వ్యక్తి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ లో గెలుపొంది హాట్ సీట్ లోకి రాబోతున్నాడు అని ప్రకటించారు. దీంతో వెంటనే ఆడియన్స్ లో కూర్చున్న విజయ్ షైర్ట్ విప్పుతూ స్టేజి మీదకి వచ్చి డ్యాన్స్ వేస్తూ స్టేజ్ అంతా తిరుగుతూ రచ్చ చేశాడు. దీంతో ఆడియన్స్ తో పాటు అమితాబ్ కూడా షాక్ అయి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇలా స్టేజి మీద తిరుగుతూనే తన భార్య దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చాడు ఆ కంటెస్టెంట్.
ఇతని రచ్చ చూసి అక్కడున్న ఆడియన్స్ చప్పట్లు కొడుతూ, అరుస్తూ అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో అమితాబ్.. కనీసం అతన్ని షర్ట్ వేసుకోనివ్వండి. లేదంటే మొత్తం బట్టలు విప్పేస్తాడేమో అని భయంగా ఉంది అని సరదాగా కౌంటర్ వేయడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు. దీంతో ఆ కంటెస్టెంట్ పక్కకి వెళ్లి షర్ట్ వేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Vijay Gupta ji ne jeet mein shirt utaar ke machayi dhamaal, lekin kya apne gyan se hotseat par woh karenge kamaal?
Dekhiye #KaunBanegaCrorepati, aaj raat 9 baje, sirf Sony par.#KBC2022@SrBachchan pic.twitter.com/FpP2J7M8Is
— sonytv (@SonyTV) August 25, 2022