a fan blackmail for pathaan movie ticket
Pathaan : సినిమా హీరోలకి అభిమానులు చాలా మంది ఉంటారని తెలిసిందే. ఒక్కొక్కరు వారి అభిమానాన్ని ఒక్కోలా చూపిస్తారు. కొంతమంది ఆ అభిమానం పిచ్చిలా, వెర్రిలా చూపిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ హీరోల కోసం, వాళ్ళ హీరోల సినిమాల కోసం ఏం చేయడానికి అయినా రెడీ అవుతారు. తాజాగా షారుఖ్ అభిమాని షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
షారుఖ్ ఖాన్ దాదాపు అయిదేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమాలో షారుఖ్, దీపికా పదుకొనే జంటగా, జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 25న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ నుంచి సినిమా వస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి.
Varun Tej : సినిమా హిట్ అవ్వడానికి నటీనటులతో సంబంధం లేదు.. ఆ సినిమాలు అలాగే హిట్ అయ్యాయి..
ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సేల్ అవుతున్నాయి. అయితే తాజాగా రియాన్ అనే షారుఖ్ అభిమాని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. రియాన్ ఈ వీడియోలో..నేను షారుఖ్ కి వీరాభిమానిని. ఐ లవ్ షారుఖ్. నేను పఠాన్ రిలీజ్ రోజే జనవరి 25న ఆ సినిమా చూడాలి. షారుఖ్ ని కలవాలి. కానీ సినిమా టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్ నాకు ఎవరైనా సాయం చేయండి. పఠాన్ మూవీ టికెట్ ఇప్పించండి. నాకు సపోర్ట్ ఇవ్వండి లేకపోతే ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు. దీంతో పఠాన్ సినిమా టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అనడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలా మంది అతన్ని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి వీడియోలు పోస్ట్ చేయకు అని, టికెట్ కొనడానికి డబ్బులు లేవు కానీ టచ్ ఫోన్ మెయింటైన్ చేయడానికి ఉన్నాయా అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
#Pathaan plz support me friends plz Pathaan 1 tickets plz help ?? #PathaanMovie #PathaanFirstDayFirstShow pic.twitter.com/1ue59cw2OJ
— Riyan (@Riyan0258) January 19, 2023