A R Rahman confirms he is giving music to ram Charan RC16
Ram Charan – A R Rahman : ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ RC16 సినిమాని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని, చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Sadha : గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ఈమధ్య విడిపోతున్నారు.. హీరోయిన్ సదా కామెంట్స్ వైరల్..
తాజాగా ఈ విషయాన్ని రెహమాన్ అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రెహమాన్. ఆ ఇంటర్వ్యూలో RC16 గురించి మాట్లాడుతూ.. “ఆ మూవీ చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. దాని గురించి ఇప్పుడే రివీల్ చేయలేను. ఆ మూవీ గురించి చెప్పడానికి చాలా టైమ్ ఉంది” అంటూ చెప్పుకొచ్చి సినిమా చేస్తున్నట్లు ధృవీకరించాడు. ఇక రెహమాన్ సంగీత దర్శకుడిగా ఓకే అవ్వడంతో చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Narne Nithin : గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా..
కాగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రకి ఎంపిక అయ్యినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమాలో సేతుపతి నటించిన విషయం తెలిసిందే. మరి RC16 లో విజయ్ సేతుపతి నటించబోతున్నాడా? అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలోపు పూర్తి కానుంది. ఆ తరువాతే RC16 సినిమా పట్టాలు ఎక్కనుంది.