స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘AA20’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్న ‘AA20’ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అల్లు అరవింద్, దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, కొరటాల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఫస్ట్ టైమ్ బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు దేవి సంగీతమందిస్తున్నాడు.
గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే బన్నీ & దేవి కాంబినేషన్ లో వచ్చిన ‘బన్నీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘డీజే’ (దువ్వాడ జగన్నాధమ్) సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మరోసారి వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా…. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకోబోతోంది.
Read Also : రామ్ ‘రెడ్’ – ప్రారంభం
‘Nani’s గ్యాంగ్‌లీడర్’ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన మిరోస్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడని తెలుస్తోంది. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ (ప్రొడక్షన్ నెంబర్ 11)
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
#AA20PoojaCeremony ?❤️ pic.twitter.com/U9zSjMdIdE
— Mythri Movie Makers (@MythriOfficial) October 30, 2019