Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..

Aadavallu Meeku Joharlu Teaser

Aadavallu Meeku Joharlu Teaser: చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Tollywood Mega Meeting: సీఎంతో స్టార్స్ భేటీ.. మోహన్ బాబు ఎందుకు మిస్సయ్యారు?

ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ ఈ మధ్యనే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు. అంటూ సాగే టైటిల్ సాంగ్ లో తన జీవితం అలా మారిపోయేలా కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. ఇక ఇప్పుడు గురువారం ఈ సినిమా టీజర్ ఒకటి విడుదల చేశారు.

Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

ప్రతి మగాడి జీవితంలో పెళ్లనేది ఒక ముఖ్య ఘట్టం.. కానీ ఇంట్లో పదిమంది ఆడాళ్ళు ఉంది ఒక అమ్మాయికి ఒకే చేయడం అంటే నరకం అంటూ శర్వా డైలాగ్ తో మొదలయ్యే ఈ టీజర్ లో శర్వా కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ అన్నీ చూపించేశాడు. మన రిజెక్ట్ చేసే స్టేజి నుండి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజికి తీసుకొచ్చారని శర్వా ప్రెస్టేషన్ సూపర్ ఎంటర్ టైనింగ్ గా కనిపిస్తుంది. రష్మిక క్యూట్ నెస్ ఈ టీజర్ కి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ఈ టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది.