Aadi Saikumar Top Gear Movie Trailer Impressive With Suspense Elements
Top Gear Movie: టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘టాప్ గేర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. హిట్, ఫ్లాప్‌లతో తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న హీరోగా ఆది మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటిస్తున్న ‘టాప్ గేర్’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Raviteja: ఆది కోసం ‘టాప్ గేర్’లో వస్తున్న రవితేజ!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మాస్ రాజా రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే హీరోకు అనుకోకుండా ఎదురైన ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో మరోసారి ఆది తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Aadi Saikumar: డిసెంబర్‌లో టాప్ గేర్ వేయబోతున్న అది సాయికుమార్..
రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శశికాంత్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి టాప్ గేర్ మూవీతో ఆది సాయికుమార్ అదిరిపోయే హిట్ అందుకుని గేర్ మారుస్తాడేమో చూడాలి.