Raviteja: ఆది కోసం ‘టాప్ గేర్’లో వస్తున్న రవితేజ!

మాస్ రాజా రవితేజ తన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అయినా కూడా ఇతర హీరోల సినిమాలకు తనవంతు ప్రమోషన్స్ చేయడానికి ఎప్పుడూ రెడీ అంటున్నాడు ఈ మాస్ హీరో. తాజాగా యంగ్ హీరో ఆది సాయి కుమార్ కోసం రవితేజ ‘టాప్ గేర్’ వేస్తున్నాడు.

Raviteja: ఆది కోసం ‘టాప్ గేర్’లో వస్తున్న రవితేజ!

Raviteja To Launch Aadi Saikumar Top Gear Movie Trailer

Updated On : December 17, 2022 / 9:59 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ తన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అయినా కూడా ఇతర హీరోల సినిమాలకు తనవంతు ప్రమోషన్స్ చేయడానికి ఎప్పుడూ రెడీ అంటున్నాడు ఈ మాస్ హీరో. తాజాగా యంగ్ హీరో ఆది సాయి కుమార్ కోసం రవితేజ ‘టాప్ గేర్’ వేస్తున్నాడు.

Aadi SaiKumar Top Gear : “టాప్ గేర్” ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ డేట్ ఫిక్స్.. అది సాయికుమార్‌కి సిద్ శ్రీరామ్ మరో హిట్ సాంగ్ ఇస్తాడా?

ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘టాప్ గేర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఆది సాయికుమార్ నటిస్తున్న టాప్ గేర్ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ట్రైలర్‌ను మాస్ రాజా రవితేజ చేతులమీదుగా లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

ఆది నటిస్తున్న ‘టాప్ గేర్’ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో తెరకెక్కించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆది పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కె.శశికాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.