‘సరిలేరు నీకెవ్వరు’ – రష్మికను ఇమిటేట్ చేసిన మహేష్ కూతురు పాప..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి టేకింగ్, మహేష్ సరికొత్తగా కనబడడంతో పాటు ఆయన కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లు వంటివి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
కథానాయిక రష్మిక క్యారెక్టర్ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయింది. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ భలే ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘దేవుడా.. ఒక క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ కుర్రోణ్ణి చూపించవయ్యా.. నీకు అర్థమవుతుందా’ అంటూ రష్మికను వీళ్లిద్దరూ భలే ఇమిటేట్ చేశారు. ఆద్య, సితార పాప ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి. ఈ వీడియోను నమ్రత ఇన్‌స్టాలో షేర్ చేయగా మహేష్ ఫ్యాన్స్, నెటిజన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.