Aamir Khan introduces Girlfriend Gauri to media on his 60th Birthday
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ శుక్రవారం 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తన కెరీర్‌కు సంబంధించిన అంశాలతో పాటు తన స్నేహితురాలు గౌరి గురించి మాట్లాడాడు.
గౌరీ స్ప్రాట్ తనకు 25 సంవత్సరాలుగా తెలుసునని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో నివసిస్తోందన్నాడు. ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉన్నట్లుగా తెలిపాడు. మధ్యలో కొన్నాళ్ల పాటు ఆమెతో టచ్‌లో లేకపోయినా రెండేళ్ల కిందట మళ్లీ కలుసుకున్నట్లుగా చెప్పాడు. తమ ఇద్దరి మధ్య 18 నెలల నుంచి రిలేషన్ షిప్ మొదలుఅయినట్లు తెలిపాడు. ఆమెకు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పాడు.
Pelli Kani Prasad : సప్తగిరి ‘పెళ్ళికాని ప్రసాద్’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు..
వాస్తవానికి గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్, గౌరిలు డేటింగ్‌లో ఉన్నట్లుగా రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఆమిర్ తాము డేటింగ్‌లో ఉన్నట్లు కన్‌ఫామ్ చేసేశాడు.
రీనా దత్తాను 1986 ఏప్రిల్ 18న ఆమిర్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2002 డిసెంబర్‌లో విడిపోయారు. ఆ తరువాత కిరణ్ రావ్‌ను 2005లో ఆమిర్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ జంట తమ వైవాహిక బంధానికి 2021లో ముగింపు పలికింది. రీనాతో జునైద్, ఇరా.. కిరణ్‌తో ఆజాద్ అనే అనే సంతానం ఉన్నారు.
Sankranthiki Vasthunam : టీఆర్పీల దుమ్ముదులిపిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ..
మహాభారత్ డ్రీమ్ ప్రాజెక్ట్..
తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ గురించి ఆమిర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు. స్క్రిప్ట్ పనులు మొదలుపెడుతున్నట్లుగా వెల్లడించాడు. ఇందుకోసం ఓ టీమ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. చాలా విషయాలను అన్వేషిస్తున్నామని, అయితే.. ఏం జరుగుతుందో చూడాలన్నాడు.