Sankranthiki Vasthunam : టీఆర్పీల దుమ్ముదులిపిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ..
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళీ ధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, భీమ్స్ సంగీతాన్ని అందించాడు.
Rajamouli : దెబ్బకి అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసి.. సెట్ వేద్దామని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి..
ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ వచ్చాయి. టీవీలోనూ ఈ చిత్రం దుమ్ము దులిపింది. ఈ చిత్ర డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్‌ను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. మార్చి1 సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్‌లోనూ అదే సమయానికి జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు.
View this post on Instagram
ఓటీటీ, టీవీ రెండింటిలోనూ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్స్ తిరగరాసింది. టీవీలో ఏకంగా 18.1 టీఆర్‌పీని సాధించింది. గత రెండేళ్లలో కాలంలో ఓ చిత్రానికి ఈ స్థాయిలో టీఆర్‌పీ రావడం ఇదే తొలిసారి. అటు జీ5 ఓటీటీలోనూ రికార్డ్స్ బ్రేక్ చేసింది.
తొలి రోజే జీ5 ఓటీటీలో అత్యధిక స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. తొలి రోజే సంక్రాంతికి వస్తున్నాం మూవీ 310 ఫ్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.
ఈ రెండు విషయాలను దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.