Nupur Shikhare : బనియన్, షార్ట్ మీద వచ్చి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ అల్లుడు

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఆమె ప్రియుడు నూపుర్ శిఖరేతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు నూపుర్ శిఖరే బనియన్, షార్ట్స్ ధరించి రావడం విమర్శలకు దారి తీసింది.

Nupur Shikhare

Nupur Shikhare : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఆమె ప్రియుడు ఫిట్ నెస్ కోచ్ నూపుర్ శిఖరేతో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. అయితే తన పెళ్లి వేడుకకు నూపుర్ శిఖర్ బనియన్, షార్ట్ వేసుకుని రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Sudheer Babu : ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుధీర్ బాబు.. ఫోటోలు

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే వివాహం బుధవారం ముంబయి తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో వేడుకగా జరిగింది. ఈ వివాహానికి అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఇద్దరు కొడుకులు జునైద్ ఖాన్, ఆజాద్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు. కాగా వివాహ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు నూపుర్ శిఖరే ముంబయి రోడ్లపై 8 కిలోమీటర్లు జాగింగ్ చేసి.. ఫైవ్ స్టార్ హోటల్ బయట తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోల్ బీట్‌కు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత వేదికపై అతిథుల మధ్య కోర్టు పత్రాలపై సంతకం చేయడం ద్వారా తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు.

Janhvi Kapoor : అదిరేటి అందాలతో గుండె గిల్లుతున్న బాలీవుడ్ సిస్టర్స్..

ఇదంతా బాగానే ఉంది.. ఐరా సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా నూపుర్ శిఖరే మాత్రం బనియన్, షార్ట్స్ ధరించి వేదికపైకి వచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి శుభ సందర్భాలకు కొంచెం గౌరవం ఇవ్వండి అంటూ హితవు చెప్పారు. అయితే మ్యారేజ్ రిజిస్టర్ కాగానే నూపుర్ తన దుస్తులను మార్చుకున్నారు. నీలిరంగు షేర్వాణీలో కనిపించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో అమీర్ ఖాన్‌కి శిక్షణ ఇవ్వడానికి వచ్చిన నూపుర్ శిఖరేతో ఐరా ఖాన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. మొత్తానికి 2024 జనవరి 3 న ఐరా ఖాన్-నూపుర్ శిఖరేలు ఒక ఇంటివారయ్యారు.