Aamir Khan : మేకప్‌మెన్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరికోసమో తెలుసా??

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ తాజాగా మేకప్‌మెన్‌గా మారాడు. అయితే తన కూతురి కోసమే అమీర్ మేకప్‌మెన్‌గా మారాడు. ఈ విషయాన్ని....................

Amir Khan

 

Aamir Khan :  ఓ బాలీవుడ్ స్టార్ హీరో మేకప్‌మెన్‌గా మారాడు. ఎవరికోసమో, ఇందుకోసమే తెలుసా? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ తాజాగా మేకప్‌మెన్‌గా మారాడు. అయితే తన కూతురి కోసమే అమీర్ మేకప్‌మెన్‌గా మారాడు. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ వెల్లడించింది. తాజాగా ఇరా ఖాన్ తన తండ్రితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

NTR 30 : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ అప్పుడే.. లీక్ చేసిన కొరటాల శివ..

ఇరా ఖాన్ తన తండ్రి అమీర్ ఖాన్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. ”నాకు మేకప్‌ ఎవరు వేశారో తెలుసా? మీ నాన్న వచ్చి నీకు మేకప్ నీ కంటే బాగా వేస్తాను అని చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది కరెక్ట్ అని తేలితే ఇంకా బాగుంటుంది. యూట్యూబ్ ట్యుటోరియల్స్‌ ఎవరికైనా కావాలా?” అంటూ పోస్ట్ చేసింది. అమీర్ ఖాన్ తన కూతురికి మేకప్ వేయగా, అమీర్ తలకు హెయిర్‌ బ్యాండ్‌ పెట్టి ఇరా నవ్వేస్తూ ఫోటోలు తీసుకుంది. ఈ ఫోటోలని చూస్తూ సోషల్ మీడియాలో సూపర్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.