NTR 30 : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ అప్పుడే.. లీక్ చేసిన కొరటాల శివ..

తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులకి తీపి కబురు చెప్పాడు. కొరటాల శివ మాట్లాడుతూ.. ''నా తర్వాతి సినిమా..........

NTR 30 : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ అప్పుడే.. లీక్ చేసిన కొరటాల శివ..

Ntr

NTR 30 :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఇవాళ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ ని అందుకొని సక్సెస్ గా దూసుకుపోతుంది ఈ సినిమా. తండ్రి కొడుకులని స్క్రీన్ మీద ఒకే సారి చూసి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గత వారం రోజులుగా బాగా చేశారు. చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆచార్య టీం.

 

ఓ ఇంటర్వ్యూలో ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాతి సినిమా కొరటాల శివతో అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి సక్సెస్ అయింది కానీ ఇప్పటికి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై అప్డేట్ రాలేదు. ఓ పక్కన ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని ఎక్కువగా బయటకి రాకుండా ఉన్నారు. మరో పక్క డైరెక్టర్ కొరటాల శివ ఏమో ఆచార్య ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏమో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

Vishnu Priya : చీర కట్టులో కవ్విస్తూ.. మెహబూబా.. మెహబూబా.. అంటున్న విష్ణుప్రియ..

తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులకి తీపి కబురు చెప్పాడు. కొరటాల శివ మాట్లాడుతూ.. ”నా తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే ఉంది. ఆ రోజు మా సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజున తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తున్నారని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.