Vishnu Priya : చీర కట్టులో కవ్విస్తూ.. మెహబూబా.. మెహబూబా.. అంటున్న విష్ణుప్రియ..
ఈ పాటకి చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకి యాంకర్ విష్ణుప్రియ చీర కట్టుకొని రీల్ చేసింది. యాంకర్, ఆర్టిస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ.............

Mehabooba
Vishnu Priya : ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. దేశమంతటా ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అన్ని చోట్ల ఈ పాటలు రిపీట్‌గా వినపడుతున్నాయి. ఈ సినిమాలో అన్ని మోటివేషనల్ సాంగ్స్, ఎలివేషన్ సాంగ్స్‌లా ఉంటే ఒక్క పాట మాత్రమే హీరో, హీరోయిన్ మధ్య ఉంది. మెహబూబా మెహబూబా అనే ఈ లవ్ సాంగ్ అన్ని పాటలలాగే బాగా వైరల్ అయింది.
Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..
ఈ పాటకి చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకి యాంకర్ విష్ణుప్రియ చీర కట్టుకొని రీల్ చేసింది. యాంకర్, ఆర్టిస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ప్రస్తుతం కొన్ని షోలలో, ఈవెంట్స్‌లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటోలతో, డ్యాన్సులు, రీల్స్‌తో హల్ చల్ చేస్తూ ఉంది. తాజాగా ‘కేజీఎఫ్ 2’ సినిమాలోని మెహబూబా సాంగ్‌కి చీరకట్టులో, మత్తైన చూపులతో, చిన్న చిన్న మూమెంట్స్‌తో కవ్విస్తూ రీల్ చేసింది. ఈ రీల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.