Aashita Singh : ఐశ్వర్య రాయ్ డూప్ ఆషిత.. వీడియోలు వైరల్..

జూనియర్ ఐశ్వర్య రాయ్‌గా పాపులర్ అయిన ఆషితా సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ సంఖ్య బాగానే ఉంది..

Aashita Singh

Aashita Singh: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ఏడుగురు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పోలికలతో స్నేహా ఉల్లాల్ దగ్గరినుండి మానసి నాయక్, మహల్గా జబేరి వంటివారు నెట్టింట దర్శనమిచ్చారు.

రీసెంట్‌గా అచ్చు ఐష్‌లానే మరో బ్యూటీ నెటిజన్లను ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతోంది. ఐశ్వర్య రాయ్‌తో పాటు పలు హిందీ సినిమాల్లో హీరో హీరోయిన్స్ చెప్పిన పాపులర్ డైలాగ్స్, సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేసి, చిన్న సైజ్ సెలబ్రిటీ అయిపోయిన ఆ ముద్దుగుమ్మ పేరు ఆషితా సింగ్..

ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగ్స్ అచ్చు ఐష్ ఎక్స్‌ప్రెషన్లతోనే చెప్పడంతో నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు. జూనియర్ ఐశ్వర్య రాయ్‌గా పాపులర్ అయిన ఆషితా సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ సంఖ్య బాగానే ఉంది. ఇంతకుముందు యూఎస్‌లో ఉండే పాకిస్థానీ బ్యూటీ ఆమ్నా ఇమ్రాన్ కూడా ఐశ్వర్య రాయ్ ఫీచర్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది.