సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఏబీసీడీ

రీసెంట్‌గా ఎబిసీడీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది..

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 12:48 PM IST
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఏబీసీడీ

Updated On : May 10, 2019 / 12:48 PM IST

రీసెంట్‌గా ఎబిసీడీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది..

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా..ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని నిర్మాణంలో, డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కిన మూవీ.. ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ).. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రిచ్ కిడ్ అయిన ఒక కుర్రాడికి, ఇండియాలో పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీకిది అఫీషియల్‌ తెలుగు రీమేక్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో అల్లు శిరీష్ ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు.

 

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా.. మెల్లగా మెల్లగా అనే మెలోడిసాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ దాటేసింది. రీసెంట్‌గా ఎబిసీడీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. మే 17 న ఏబీసీడీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని.

వాచ్ వీడియో సాంగ్..