క్యాష్ చేసుకోండి : అభినంద‌న్ బ‌యోపిక్ తీస్తున్నారు

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 06:20 AM IST
క్యాష్ చేసుకోండి : అభినంద‌న్ బ‌యోపిక్ తీస్తున్నారు

Updated On : March 5, 2019 / 6:20 AM IST

దేశంలో ఇప్పుడొక రియల్ హీరో అతడు. శత్రు సైన్యానికి చిక్కినా అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరుడు. దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీరుడు. శత్రువుల చెరలో ఉన్నా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. అతడే భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. ఈ రియల్ హీరో జీవితం రీల్‌కి ఎక్కనుంది.

అభినందన్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ దిగ్గజ ఫిలింమేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
Also Read : కన్నడలో డబ్ అయిన రంగస్థలం

అభినందన్ బయోపిక్‌కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అభినందన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ హంక్… జాన్ అబ్రహం అభినందన్ పాత్రపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. దర్శక నిర్మాతలు అబ్రహంకే ఛాన్స్ ఇస్తారా… మరెవరినైనా ఎంపిక చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Also Read : షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!