Abhishek Bachchan Aishwarya Rai Aaradhya during Anant Ambani wedding
Abhishek Bachchan- Aishwarya Rai: బాలీవుడ్ బ్యాటీఫుల్ ఫెయిర్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా గాసిప్స్ వస్తున్నాయి. అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఐశ్వర్యరాయ్ తన భర్తతో కాకుండా విడిగా రావడంతో రూమర్లు మరింత పెరిగాయి. అభిషేక్ బచ్చన్ తన తండ్రి, తల్లి, సోదరితో కలిసి అనంత్ అంబానీ పెళ్లికి వచ్చారు. ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి తర్వాత అక్కడికి విచ్చేశారు. దీంతో గాసిప్ రాయుళ్లు మరింత పెట్రేగారు.
అయితే తాజాగా బయటకు వచ్చిన మరో వీడియో గాసిప్ రాయుళ్ల నోళ్లకు తాళం వేసింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పక్కపక్కనే కూర్చోవడం వీడియోలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ ఉత్సాహంగా తన కూతురితో ముచ్చట్లాడుతున్నట్టు వీడియోలో ఉంది. అభిషేక్ మాత్రం వెడ్డింగ్ వేడుకను తదేకంగా చూస్తున్నారు.
రెడిట్ షేర్ చేసిన ఈ వీడియోలో సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోని అతిథులను పలకరిస్తూ కనిపించారు. అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటను మాత్రం జూమ్ చేసి చూపించడంతో ఆసక్తికరంగా మారింది. కెమెరాను చూసి ఐశ్వర్యరాయ్ స్మైల్ ఇవ్వడం విశేషం. కాగా తల్లిదండ్రులతో కలిసి వచ్చినప్పటికీ భార్య పక్కనే అభిషేక్ కూర్చోవడంతో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టైంది.
Also Read : అంబానీ పెళ్లిలో.. అమితాబ్‌ను చూడగానే సూపర్ స్టార్ రజినీకాంత్ ఏం చేశాడంటే.. వీడియో..
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పక్కపక్కనే కూర్చున్న వీడియో వైరల్ కావడంతో నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అభిషేక్, ఐశ్వర్య విడిపోవడం లేదని ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని చాలా మంది అంటున్నారు. అయితే అభిషేక్.. ఐశ్వర్యతో మాట్లాడకపోవడాన్ని కొంతమంది పాయింటవుట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియాతో రూమర్లకు ఫుల్ స్టాఫ్ పడుతుందని బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Aaradhya & #AbhiAish ♥️ #AnantwedsRadhika #AishwaryaRaiBachchan #AbhishekBachchan pic.twitter.com/kel8kvxlmp
— Aishwarya Rai Fan (@amit_AishGang) July 13, 2024