Abhishek Bachchan : హాస్పిటల్‌లో అభిషేక్.. ఐశ్వర్య రాలేదా..?

భర్త ప్రమాదానికి గురైతే ఐశ్వర్య రాయ్ బచ్చన్ వచ్చి చూడాలి కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Abhishek Bachchan

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ నంద ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‌ను పరామర్శించారు.

అమితాబ్, శ్వేత హాస్పిటల్‌కి వెళ్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. కాగా భర్తను చూడ్డానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రాలేదని.. భర్త ప్రమాదానికి గురైతే వచ్చి చూడాలి కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఐశ్యర్య రాయ్, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగు నుండి ఆదివారం రాత్రి ముంబై చేరుకున్నారు. కూతురు ఆరాధ్యతో కలిసి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను కలిశారామె. కొద్ది రోజుల క్రితం ఓ షూటింగ్‌లో అభిషేక్ చేతికి గాయమైంది. అప్పుడు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయ్యారు.