Prabhas-Abhishek: ప్రభాస్ మూవీలో అభిషేక్.. క్రేజీ ప్రాజెక్టులో కీ రోల్.. ఇంతకీ ఏ సినిమా కోసమో తెలుసా?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు(Prabhas-Abhishek). ఇప్పటికే కల్కి సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే.

Abhishek Bachchan to play a key role in Prabhas Fauji movie

Prabhas-Abhishek: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. అశ్వద్ధామగా కనిపించిన అమితాబ్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓజీలో మరో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. కథలో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారక్టర్ కావడంతో ఒప్పేసుకున్నాడట ఇమ్రాన్. ఇక యానిమల్ సినిమాతో విలన్ అవతారం ఎత్తిన బాబీ డియోల్ ఆ తరువాత బాలకృష్ణతో డాకు మహారాజ్, పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలు చేసి మెప్పించాడు.

Malavika Mohanan: సినిమాలు కాదు పాత్రలు ముఖ్యం.. అవికూడా ఎలాంటివో తెలుసా? మాళవిక కామెంట్స్ వైరల్

ఇప్పుడు మరో బాలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్(Prabhas-Abhishek). అవును, ఆ స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఆ సినిమానే ఫౌజీ. సీతా రామమ్ సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెంకండ్ వరల్డ్ వార్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో మరో బలమైన పాత్ర కోసం అభిషేక్ ను అప్రోచ్ అయ్యారట మేకర్స్.

కథ, తన పాత్ర చాలా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట అభిషేక్. సీతా రామమ్ సినిమాలో సుమంత్ అక్కినేని చేసిన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి అలనాటి అద్భుతమైన పాత్రను అభిషేక్ కోసం క్రియేట్ చేశాడట దర్శకుడు హను రాఘవపూడి. పాత్రలో ఆ డెప్త్ నచ్చడంతోనే వెంటనే ఒప్పుకున్నాడట అభిషేక్. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి కల్కి సినిమాలో అమితాబ్ తో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ ఫౌజీ సినిమాలో అభిషేక్ తో నటించి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.