Accident in AR Rahman film studio.. Lightman passed away..
AR Rahman : స్వరకర్త, ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు AR రెహమాన్ ఇటీవల మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. AR రెహమాన్ కు తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో సొంత ఫిలిం స్టూడియో ఉంది. ఇక్కడ సినిమా షూటింగ్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఈ స్టూడియోని ఫిలిం షూటింగ్స్ కి రెంట్ కి ఇస్తారు AR రెహమాన్.
Waltair Veerayya : అమెరికాలో మెగాస్టార్ మరో రికార్డు.. కొనసాగుతున్న వాల్తేరు వీరయ్య ప్రభంజనం..
ప్రస్తుతం ఈ స్టూడియోలో ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ కోసం 30 అడుగుల ఎత్తులో లైట్ బింగించే క్రమంలో కుమార్ అనే ఓ లైట్ మ్యాన్ ప్రమాదవశాత్తు క్రింద పడ్డాడు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది అతనిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కానీ 30 అడుగుల ఎత్తు నుండి పడటంతో హాస్పిటల్ కి వచ్చే మార్గంలోనే మరణించాడని వైద్యులు తెలిపారు. లైట్ మెన్ మరణించిన ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.