Hero Nikhil Movie: టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదమయంగా మారింది. దీంతో కెమెరాలు, ఇతర షూటింగ్ సామాగ్రి నీట మునిగాయి. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగింది.