Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష సోదరుడికి యాక్సిడెంట్.. వాళ్ళ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా వర్ష సోదరుడు ప్రమాదానికి గురయ్యాడు. దాని గురించి తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్‌ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది.....

Varsha

Jabardasth Varsha :   మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి ఆ తర్వాత సీరియల్స్ లో నటిస్తూ జబర్దస్త్ అవకాశం అందుకుంది వర్ష. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ తో కలిసి తనదైన శైలిలో పంచులు వేస్తూ, కామెడీ చేస్తూ అలరిస్తుంది. జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది వర్ష. తాజాగా వర్ష సోదరుడు ప్రమాదానికి గురయ్యాడు. దాని గురించి తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్‌ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది.

BiggBoss Vishwa : బిగ్‌బాస్ విశ్వ హోమ్ టూర్.. ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడుగా..

తన సోదరుడి ఫోటోని షేర్ చేస్తూ.. ”దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. మీరు డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్‌ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా సఫర్‌ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది” అని వర్ష పేర్కొంది.