Jabardasth Ram Prasad : జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ కి యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..
తాజాగా మోస్ట్ పాపులర్ జబర్దస్త్ కమెడియాన్ రాంప్రసాద్ కి యాక్సిడెంట్ అయ్యింది.

Accident to Most Popular Jabardast Comedian Auto Ramprasad
Jabardasth Ram Prasad : ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై తిరుగులేని షోగా కొనసాగుతుంది జబర్దస్త్. ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ షో ద్వారా ఎంతో మందికి సినిమా అవకాశాలు వస్తున్నాయి, కొంతమంది అయితే ఏకంగా హీరోలు కూడా అయ్యారు. జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అందరూ ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు.
అయితే తాజాగా మోస్ట్ పాపులర్ జబర్దస్త్ కమెడియాన్ రాంప్రసాద్ కి యాక్సిడెంట్ అయ్యింది. ఆటో రాంప్రసాద్ ఎప్పటిలాగే షూటింగ్ కి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఆయన వెళుతున్నప్పుడు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో జబర్దస్త్ కమెడియన్ తన కారు బ్రేక్ వేసాడు. అప్పుడు తన కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కి పలు చిన్న చిన్న గాయాలు అయ్యాయట.
Also Read : Naga Chaitanya-Sobhita : చైతు, శోభిత పెళ్ళికి ఎవరెవరు వచ్చారో తెలుసా..
ఇక జబర్దస్త్ షోలో ఎప్పటినుండో కొనసాగుతున్నారు ఈయన. రాంప్రసాద్ తో పాటు సుధీర్, శ్రీను కూడా ఉన్నారు. ఎవ్వరికైనా సరే జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ముగ్గురే. అలాంటిది కొంత కాలంగా వీరు కలిసి కనిపించడం లేదు. సుధీర్, శ్రీను హీరోగా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాంప్రసాద్ ఇంకా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.