Acharya film shooting at JK Mines at yellandu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా షూటింగ్ ఆచార్య కోసం దర్శకుడు కొరటాల శివ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిశారు. మార్చి 7 నుంచి 15 వరకు ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది.
ఇందుకోసం అనుమతులు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి… మెగాస్టార్ చిరంజీవికి తానే ఆతిధ్యం ఇస్తానన్నారు. పువ్వాడ అజయ్‌కు కొరటాల శివ కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య సినిమా షూటింగ్… ఇల్లందులోని జేకే మైన్స్‌లో నిర్వహించనున్నారు.
జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో జరగనున్న షూటింగ్‌లో హీరో చిరంజీవితో పాటు… రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతోందని… సినిమా షూటింగ్‌ల కోసం జిల్లాలో చాలా అనువైన ప్రాంతాలున్నాయని దర్శకుడు కొరటాల శివ అన్నారు.