Arjun Sarja : అర్జున్ నిర్మించిన ‘ఆంజనేయస్వామి గుడి’.. జూలై 1న ‘మహా కుంభాబిషేకం’..

అర్జున్‌ స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు.. అందుకే ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గరలో, తన సొంత స్థలంలో తన ఇష్టదైవం ఆంజనేయ స్వామి గుడికి శ్రీకారం చుట్టారు..

Arjun Sarja : అర్జున్ నిర్మించిన ‘ఆంజనేయస్వామి గుడి’.. జూలై 1న ‘మహా కుంభాబిషేకం’..

Arjun Sarja

Updated On : June 29, 2021 / 6:31 PM IST

Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్.. నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ మీద వినిపిస్తున్న పేరు.. నటనతో పాటు సామాజిక సేవాకార్యక్రమాల్లో సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్ సర్జా. అర్జున్‌ స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు.

అందుకే ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గరలో, తన సొంత స్థలంలో తన ఇష్టదైవం ఆంజనేయ స్వామి గుడికి శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, గత 15 సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి భక్తుల సందర్శనార్ధం, సర్వాంగ సుందరంగా రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన మహా కుంభాబిషేకం జులై 1న అంగరంగవైభవంగా జరుగనుంది.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరినీ పిలిచి ఈ కుంభాబిషేకం కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నామని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎవర్నీ పిలవలేకపోతున్నానని, జూలై 1, 2 తేదీల్లో జరుగబోయే ఈ మహా కుంభాబిషేకాన్ని ఎవరూ మిస్ కాకూడదని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నామని, అందరూ తప్పక చూడాలని వీడియో ద్వారా తెలియజేశారు అర్జున్.