మూడేళ్ల నుంచి నా పేరు మీద అకౌంట్ రన్ చేస్తున్నాడు..

  • Publish Date - July 18, 2020 / 05:07 PM IST

సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఇప్పటివరకు చాలా చూశాం. ఇప్పుడీ లిస్ట్‌లో ప్రముఖ నటుడు అలీ పేరు కూడా యాడ్ అయింది. తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఉండడాన్ని గుర్తించిన అలీ తాజాగా సైబరాబాద్‌ సైబర్ క్రైమ్ డీసీపీ రోహిని ప్రియదర్శినిని కలిసి తన పేరుతో అకౌంట్ రన్ చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘‘త్రీ ఇయర్స్ నుంచి నా పేరు మీద ట్విట్టర్ అకౌంట్ వాడుతున్నాడు ఆ వ్యక్తి. అందులో పోస్టులు అవీ చేస్తున్నారు. నిన్న నా పేరు మీద అఫిషీయల్‌ ట్విట్టర్‌ అకౌంట్ చూసి ఆశ్చర్యపోయాను. వాళ్లు చేసే పోస్ట్‌లలో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు బ్యాడ్ నేమ్ వచ్చేది నాకే కదా.. అందుకే రోహిణి గారిని కలిసి కంప్లైంట్ చేశాను. సోమవారం లోపు నిందితుణ్ణి పట్టుకుంటామని చెప్పారు. నా పేరు మీద అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఫ్యూచర్లో ఉంటుంది’’ అని తెలిపారు అలీ.


https://www.youtube.com/watch?v=3ExtXZCMUSI