Bandla Ganesh : హీరోగా బండ్ల గణేష్..! దర్శకుడిగా నటుడు..

ఈ సినిమాకు గాను పార్థిబన్ జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు..

Actor Bandla Ganesh

Bandla Ganesh: నటుడు, భారీ చిత్రాల నిర్మాత, వ్యాపార వేత్త.. బండ్ల గణేష్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన హీరోగా, నటుడు వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా స్వాతి చంద్ర ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీతో బండ్ల గణేష్ హీరోగా మారుతున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది.

Bandla Ganesh : ‘‘రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం.‌ ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళ్‌లో ఆర్. పార్థిబన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ కి‌ రీమేక్ ఇది. ఈ సినిమాకు గాను పార్థిబన్ జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు’’ అన్నారు.

 

‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ ఇటీవలే చెన్నైలో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక దర్శకుడు వెంకట్ చంద్ర విషయానికొస్తే.. తను నటుడిగా పలు సినిమాల్లో నటించారు. వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ లో ‘ఒక్కమ్మాయి దొరక్క చస్తుంటే.. నీకు డజన్ల కొద్దీ ఎఫైర్లా.. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామా.. నేను వీణ్ణి చంపేసి జైలుకెళ్లిపోతా’ అనే డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడీ నటుడు మెగాఫోన్ పట్టబోతున్నారు.