Bandla Ganesh : రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

‘గబ్బర్ సింగ్’ గురించి గణేష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఆకట్టుకోవడమే కాక తెగ వైరల్ అవుతోంది..

Bandla Ganesh : రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

Bandla Ganesh

Updated On : August 21, 2021 / 8:18 PM IST

Bandla Ganesh: పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు తాను భక్తుడినని చెప్పుకుంటారు నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్. ‘తీన్‌మార్’ సినిమాతో తనను నిర్మాతగా పరిచయం చేసిన పవన్ అంటే బండ్లకు ప్రత్యేకమైన అభిమానం. తర్వాత తన బాస్‌కి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చానని గర్వంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటాడు.

Bandla Ganesh : ‘మా’ కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు..

కొన్ని ఫంక్షన్లలో పవర్‌స్టార్ మీద తన ప్రేమను అభిమానాన్ని ఏ స్థాయిలో చెప్పుకున్నాడో తెలిసిందే. ‘వకీల్ సాబ్’ ఫంక్షన్లో ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..’ అంటూ పంచులు పేల్చి హైలెట్ అయ్యాడు. కొద్దికాలంగా ట్విట్టర్‌లో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు బండ్ల. ఇటీవల ఒక యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్సకు సాయం చెయ్యమని కోరగా.. తన వంతు సహాయం అందించి అందరి అభినందనలు అందుకున్నారు.

Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అండ్ సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ గురించి గణేష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఆకట్టుకోవడమే కాక తెగ వైరల్ అవుతోంది. ‘‘రామాయణం చదువుతూ ఉంటాం.. భారతం వింటూ ఉంటాం.. ‘గబ్బర్ సింగ్’ చూస్తూ ఉంటాం’’.. అంటూ పవన్ Gif షేర్ చేశారు బండ్ల గణేష్.

Gabbar Singh

కొంత గ్యాప్ తర్వాత పవన్ – బండ్ల గణేష్ కాంబినేషన్‌లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల. ఈ సినిమా కోసం ‘దేవరా’ అనే టైటిల్ ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారనే వార్త వైరల్ అవుతోంది.