Bandla Ganesh : ‘మా’ కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు..

అభ్యర్థులందరూ సొంతంగా భవనం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు.. ఇప్పుడీ విషయం గురించి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

Bandla Ganesh : ‘మా’ కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు..

Bandla Ganesh

Updated On : August 19, 2021 / 4:53 PM IST

Bandla Ganesh: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ‘మా’ కి శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ప్రకాష్ రాజ్, హేమ, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహ రావు.. ఇలా ఏకంగా ఐదుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ చెయ్యబోతున్నారు.

Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

ఇప్పటివరకు ‘మా’ కు సొంతంగా భవనం లేదు. అభ్యర్థులందరూ సొంతంగా భవనం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇప్పుడీ విషయం గురించి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘మా’ కి సొంత బిల్డింగ్ అవసరం లేదనేది నా ఉద్దేశం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bandla Ganesh : జూనియర్ బండ్ల గణేష్ భలే ఉన్నాడుగా..

‘ప్రకాష్ రాజ్ మంచి నటుడే కాదు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు నేను కళ్లారా చూశాను. ‘మా’ కోసం కూడా ఎన్నో అభివృద్ధి పనులు చెయ్యాలనుకుంటున్నారు. ‘మా’ ను మరింత డెవలప్ చెయ్యగలరనే నమ్మకం ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’ కి శాశ్వత భవనం నిర్మించడం అనేదే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు.

Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..

అసోసియేషన్‌‌లో 900 మంది సభ్యులున్నారు. వారిలో 150 మంది దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. చాలా కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టే 20 కోట్ల రూపాయలతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్ వేరే లెవల్లో ఉంటుంది. ‘మా’ కి ఇప్పుడు బిల్డింగ్ కట్టనంత మాత్రాన ఇండస్ట్రీ ఏం ఆగిపోదు. షూటింగులు ఆగిపోవు. సినిమా చూసేవాళ్లు ఏం తగ్గిపోరు’ అంటూ తన వెర్షన్ చెప్పారు బండ్ల గణేష్.

RRR Team: గెట్ రెడీ.. గుమ్మడికాయ కొట్టేశారు..