Avasarala Srinivas : ఇండస్ట్రీలో రైటర్స్ కి గుర్తింపు లేదు.. డబ్బులివ్వరు.. అవసరాల శ్రీనివాస్ వ్యాఖ్యలు..
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా మార్చ్ 17న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అవసరాల శ్రీనివాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో....................
- Saketh U
- Published On : March 15, 2023 / 01:38 PM IST
Actor Director Avasarala Srinivas Comments on Writers situation in industry
Avasarala Srinivas : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఓ పక్క నటుడిగా సినిమాలు చేస్తూనే మరో పక్క దర్శకుడిగా కూడా సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. గతంలో ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద సినిమాలతో డైరెక్టర్ గా మెప్పించాడు అవసరాల శ్రీనివాస్. 2016 తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా సినిమాలు చేయలేదు. నటుడిగా, రచయితగా కొన్ని సినిమాలు చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత దర్శకుడిగా రాబోతున్నాడు శ్రీనివాస్.
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా మార్చ్ 17న రిలీజ్ కాబోతుంది. 18 ఏళ్ళ వయసు నుంచి 28 ఏళ్ళ వయసు వరకు ఓ జంట మధ్యలో ఉండే ప్రేమకథ గా ఈ సినిమాని మెలోడీ లవ్ డ్రామాలా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అవసరాల శ్రీనివాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ…నేను కరోనా టైంలో ఖాళీగా ఉండి కథలు రాసుకోలేకపోయాను అని బాధపడుతున్నాను. నా కథలు వేరే వాళ్లకు ఇస్తాను కానీ డబ్బులు ఇస్తేనే. ఇండస్ట్రీలో రైటర్లకు సరైన గుర్తింపు లేదు. రైటర్లకు డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు. అందుకే నా కథలను నేనే సినిమాలు తీసుకుంటాను. నిజంగా నాకు డబ్బులు ఇస్తే నా కథలను వేరేవాళ్లకు ఇవ్వడానికి నేను రెడీనే. ఇది నేను ఇంకో రైటర్ దగ్గరే నేర్చుకున్నాను. డైరెక్టర్ గా ఓ 10 మంచి సినిమాలు తీస్తే చాలు నాకు అని అన్నారు. దీంతో రైటర్లకు డబ్బులు ఇవ్వరు ఇండస్ట్రీలో అని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Samantha : పెద్దమ్మ తల్లి టెంపుల్ లో శాకుంతలం టీంతో సమంత.. ప్రమోషన్స్ షురూ..
ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ చేస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో నాగశౌర్య హీరో. వీళ్లిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా. గతంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద సినిమాలు మంచి క్లాసిక్ హిట్స్ సాధించాయి. దీంతో ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ కొడతారని భావిస్తున్నారు.
