Actor Haranath Daughter Padmaja Raju Passes Away
Padmaja Raju: టాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత జివిజి రాజు సతీమణి పద్మజా రాజు మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అలనాటి అందాల నటుడు హరనాథ్ కూతురిగా, నిర్మాత జివిజి రాజు భార్యగా పద్మజా రాజు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నారు. ఆమె భర్త జివిజి రాజు టాలీవుడ్‌లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’
ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. అంతేగాక తెలుగు ప్రేక్షకులకు ఆల్‌టైమ్ ఫేవరెట్ ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయిన ‘గోదావరి’ మూవీని కూడా జివిజి రాజు ప్రొడ్యూస్ చేశారు. ఇక పద్మజా రాజు ఇటీవల తన తండ్రి హరనాథ్ జీవితకథను ‘అందాల నటుడు’ అనే పుస్తకరూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే వచ్చే ఏడాది తమ కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.
ఇంతలోనే పద్మజా రాజు హఠాన్మరణం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పద్మజా రాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని పలువురు శ్రేయోభిలాషులు కోరుతున్నారు.