Huma Qureshi : పార్కింగ్ విషయంలో గొడవ.. నటి హ్యుమా ఖురేషీ బంధువు దారుణ హత్య..
పార్కింగ్ స్థలం విషయంలో చెలరేగిన గొడవలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

Actor Huma Qureshi Cousin Murdered Over Parking Space
పార్కింగ్ స్థలం విషయంలో చెలరేగిన గొడవలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని నటి హ్యుమా ఖురేషీ బంధువు ఆసిఫ్ ఖురేషి గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి జంగ్పురా భోగల్ లేన్‌లో ఓ వ్యక్తి స్కూటీని పారింగ్క్ చేశాడు. తన ఇంటి ప్రధాన ద్వారం దగ్గరగా పార్క్ చేసిన స్కూటీని అక్కడి నుంచి తీసివేయాలని ఆసిఫ్ ఖురేషి కోరారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Bakasura Restaurant : ‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ.. తిండిపోతు దయ్యంతో హారర్ కామెడీ..
సదరు వ్యక్తితో పాటు మరోవ్యక్తి పదునైన ఆయుధంతో ఖురేషి పై దాడి చేశారు. దీంతో ఆసిఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టు ప్రక్కల ఉన్న వారు అతడిని తూర్పు కైలాష్‌లోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అయితే.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
చిన్న పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా తన భర్తను హత్య చేశారని ఆసిఫ్ భార్య షాహీన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులు ఉజ్వల్ (19), గౌతమ్ (18) గా గుర్తించి అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.