×
Ad

JD Chakravarthy: ఇన్‌స్టాగ్రామ్‌లో జేడీ చక్రవర్తి ఎంట్రీ.. దేవుడు కాదు దేవుళ్ళు.. మొదటి పోస్ట్ తోనే షేక్ చేశాడుగా..

చక్రవర్తి అంటే ఎవరు గుర్తుపట్టారు కానీ దానికి జేడీ (JD Chakravarthy)యాడ్ చేస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి.

Actor JD Chakraborty opens an account on Instagram

చక్రవర్తి అంటే ఎవరు గుర్తుపట్టారు కానీ దానికి జేడీ యాడ్ చేస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒకరోజు, ఎగిరే పావురమా, బొంబాయి ప్రియుడు లాంటి తెలుగు సినిమాలు ఆయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. నిజానికి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయినా జేడీ చక్రవర్తి మాటలు కూడా గురువు లాగానే ఉంటాయి.

Akhanda 2: అప్పుడు క్రాక్.. ఇప్పుడు అఖండ 2.. మహేష్ బాబు నిర్మాతలకు తప్పని తిప్పలు..

అయితే, గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఈనటుడు ప్రముఖ సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, నటుడు జేడీ చక్రవర్తికి ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ లేదు. మొదటిసారి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ తోనే చాలా మందికి టాప్ లేచిపోయే పోస్ట్ పెట్టాడు జేడీ చక్రవర్తి. ‘నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. దేవుళ్లను నమ్ముతాను. అందరి దేవుళ్లను నమ్ముతాను. జై ఆంజనేయ. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో జేసీ చక్రవర్తి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సినిమాల్లోనే తన పిచ్చిని చూపించే జేడీ చక్రవర్తి సోషల్ మీడియాలో ఎంత రచ్చ లేపుతాడో చూడాలి.