Mohan Babu : ఆస్ప‌త్రి నుంచి సినీ న‌టుడు మోహ‌న్ బాబు డిశ్చార్జ్‌.. వారం రోజులు రెస్ట్..

సినీ న‌టుడు మోహ‌న్ బాబు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Actor Mohan Babu discharged from hospital

సినీ న‌టుడు మోహ‌న్ బాబు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు ఆయ‌న‌కు సూచించారు.

మంగ‌ళ‌వారం రాత్రి జ‌ల్‌ప‌ల్లిలోని త‌న‌ నివాసంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ అనంత‌రం మోహ‌న్ బాబు గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఒళ్లు నొప్పులు, ఆందోళ‌న వంటి కార‌ణాల‌తో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న‌కు కంటి దిగువ భాగంలో గాయ‌మైన‌ట్లు గుర్తించిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Amardeep-Supritha : అమ‌ర్‌దీప్‌-సుప్రీత సినిమాకు టైటిల్‌ పెట్టే ఛాన్స్‌.. ఎలాగో తెలుసా?

బీపీ ఎక్కువ‌గా ఉంద‌ని, గుండె కొట్టుకోవ‌డంలో హెచ్చుత‌గ్గులు ఉన్నాయ‌ని చెప్పారు. దీంతో రెండు రోజుల పాటు ఆయ‌న‌కు చికిత్స అందించారు. గురువారం మ‌ధ్యాహ్నం ఆయ‌న్ను డిశ్చార్జి చేశారు. ఇంట్లోనే వారం పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రాచ‌కొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేయ‌గా, దీనిపై మోహ‌న్ బాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నెల 24 వ‌ర‌కు కోర్టు స్టే ఇచ్చింది.

7/G – The Dark Story : ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ మూవీ.. ‘7/జీ ది డార్క్ స్టోరీ’..