7/G – The Dark Story : ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ మూవీ.. ‘7/జీ ది డార్క్ స్టోరీ’..
ఆహాలో ఇప్పుడు మరో సరికొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అదే 7/జీ ది డార్క్ స్టోరీ సినిమా.

The horror movie 7/G The Dark Story came to OTT
7/G – The Dark Story : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలిసిందే. ప్రతీ వారం సరికొత్త సినిమాలు సిరీస్ తో ఎప్పుడూ అలరించే ఆహాలో ఇప్పుడు మరో సరికొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అదే 7/జీ ది డార్క్ స్టోరీ సినిమా. ‘7/జి బృందావన కాలనీ’ సినిమాతో భారీ ఫేమ్ తెచ్చుకున్న సోనియా అగర్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. హార్రర్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి స్పందన కనబరిచింది.
Also Read :Keerthy Suresh : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ.. పెళ్లి ఫోటోలు చూసారా..
హారూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది తమిళంలో విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. కాగా ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి ‘7/G’ అనే టైటిల్ ఉన్నప్పటికీ ‘7/G’ సినిమాకు దీనికి ఎటువంటి లింక్ లేదు. ఈ ఏడాది జులై 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపుగా ఐదు నెలల తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ హర్రర్ సినిమా ఎలా ఉందో మీరు కూడా చూసేయ్యండి…
View this post on Instagram
ఇక ఈ సినిమా.. కొత్తగా ఫ్లాట్ లోకి వచ్చిన భార్య భర్తలకు ఎదురయ్యే భయంకర ఘటనల నేపథ్యంలో సాగుతుంది. స్మృతి వెంకట్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి హారున్ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సోనియా అగర్వాల్ ఓ దెయ్యం పాత్రలో కనిపిస్తారు..