Keerthy Suresh : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ.. పెళ్లి ఫోటోలు చూసారా..

టాలీవడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ఆంటోనీ ఇద్దరూ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

Keerthy Suresh : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ.. పెళ్లి ఫోటోలు చూసారా..

Keerthy Suresh Antony wedding photos

Updated On : December 12, 2024 / 2:52 PM IST

Keerthy Suresh : టాలీవడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ఆంటోనీ ఇద్దరూ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ రోజు వారి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయిపోయిన నేపథ్యంలో కీర్తి సురేష్ తాజాగా తన వివాహ ఫోటోలు షేర్ చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్.

Also Read : Allu Arjun : అక్కడ పుష్ప 2 సక్సెస్ మీట్ వేళ.. తల్లితో కలిసి అల్లు అర్జున్ ఎమోషననల్ మూమెంట్..

తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నానని, డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నాం అని ఇప్పటికే చెప్పింది కీర్తి. చెప్పినట్టుగానే ఈ రోజు వీరి వివాహం జరిగింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో ఒప్పించి ఇన్ని ఏళ్ళ తర్వాత గ్రాండ్ గా ఆంటోనీని వివాహ మాడింది కీర్తి. ప్రస్తుతం కీర్తి షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.