Actor Mukul Dev Dies At 54
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.
‘నమ్మలేకపోతున్నాను. రిప్..’ అంటూ ఆమె నటుడితో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
Gurthimpu : స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా.. ‘గుర్తింపు’ ఫస్ట్ లుక్ రిలీజ్..
సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో ముకుల్ తో కలిసి నటించిన నటుడు విందు దారా సింగ్ కూడా ఈ విషాద వార్తను ధృవీకరించారు. ముకుల్ ను మళ్లీ తెరపై చూసే అవకాశం ఎప్పటికీ రాదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముకుల్ దేవ్ చివరిగా చిత్రం ఆంత్ ది ఎండ్ అనే హిందీ చిత్రంలో నటించారు.
నటుడు రాహుల్ దేవ్ తమ్ముడు అయిన ముకుల్ దేవ్ హిందీ, పంజాబీలతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’తో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కేడి’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు
Adivi Sesh : సుమంత్ అప్పటి నుంచి మా ఫ్యామిలీనే : అడివి శేష్
తల్లిదండ్రులు మరణించడంతో ముకుల్ దేవ్ ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.