ప్రభాసే అందరికీ కొనిచ్చారు.. నమస్తే పెట్టుకునే వాళ్లమంతే..

కరోనా ఎఫెక్ట్- స్వీయ నిర్భందంలోకి వెళ్లిన పాపులర్ కమెడియన్ ప్రియదర్శి..

  • Publish Date - March 18, 2020 / 07:01 AM IST

కరోనా ఎఫెక్ట్- స్వీయ నిర్భందంలోకి వెళ్లిన పాపులర్ కమెడియన్ ప్రియదర్శి..

గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్, ఇటీవలే ప్రధాన పాత్రలో ‘మల్లేశం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్టు తెలిపాడు.

ఇటీవలే జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ప్రియదర్శి శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్ర్కీనింగ్ అనంతరం ఇంట్లోనే ఉండిపోయాడు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14రోజుల పాటు ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రియదర్శి ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

జార్జియాలో షూటింగ్ చేసేటప్పుడు యూనిట్ అంతా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.. ప్రభాసే అందరికీ శానిటైజర్లు కొనిచ్చారు. సెట్‌లో షేక్ హ్యాండ్ బదులు ఒకరికొకరు నమస్తే పెట్టుకునేవాళ్లం అని తెలిపాడు..

కాగా ప్రియదర్శి తీసుకున్న సెల్ఫ్ క్వారంటైన్ గురించి తెలిసి అందరూ అతణ్ణి ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కరోనా వైరస్ సోకకుండా డాక్టర్ల పర్యవేక్షణలో సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

See Also |  ప్రభాస్ అండ్ టీమ్ కరోనాను తట్టుకుని మరీ తిరిగొచ్చారు..