Puneeth Rajkumar : అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..

పునీత్ చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు..

Siva Rajkumar

Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ గుండెపోటుకి గురయ్యారు. దీంతో ఆయణ్ణి బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Puneeth Rajkumar : పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అభిమానుల్లో ఆందోళన..

గతంలో పునీత్ అన్నయ్య కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యారు. ఇప్పుడు తమ్ముడు పునీత్ రాజ్ కుమార్‌ కూడా అలాగే జిమ్ చేస్తూ గుండెపోటుకి గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Jai Bhajarangi : ‘కె.జి.యఫ్’ రేంజ్‌లో శివన్న ‘జై భజరంగి’

పునీత్ చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ వార్త వినగానే శాండల్‌వుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సీనీ ప్రముఖులు, సన్నిహితులు పునీత్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Dhanya Ramkumar : కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న రాజ్ కుమార్ మనవరాలు..