Raghava Lawrence : లారెన్స్ దానగుణం.. ఈ సారి రైతుల కోసం.. మీరు కూడా లారెన్స్ తో కలిసి హెల్ప్ చేయాలంటే..

సినీ ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒక‌రు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒక‌రు. కొరియోగ్రాఫ‌ర్‌గా, హీరోగా, డైరెక్ట‌ర్‌గా, నిర్మాతగా ఇలా అన్నింటిలో త‌న‌దైన ముద్ర వేశాడు. ఆయ‌న‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఆయ‌న్ను అభిమానించ‌డానికి మూవీల‌కు మించిన మ‌రో కార‌ణం ఉంది. ఆయ‌న చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు. దివ్యాంగులు, అనాథ బాల‌లు, పేద‌ల కోసం త‌న వంతు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. తాజాగా ఆయ‌న మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు.

నేడు కార్మికుల దినోత్స‌వం (మేడే) సంద‌ర్భంగా సేవే దేవుడు అంటూ ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం మొద‌టి విడుత‌గా 10 ట్రాక్ట‌ర్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నిస్వార్థ ప్ర‌యాణంలో ప్ర‌తి ఒక్క‌రూ చేరి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Sukumar Daughter : ద‌ర్శ‌కుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణికి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..

స్నేహితులు, అభిమానులారా.. కార్మికుల దినోత్సవం సందర్భంగా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవే దేవుడు అనే చొరవతో ఈ ప్ర‌త్యేకమైన ప్ర‌యాణాన్ని ప్రారంభించాం. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మ‌న దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం స్వంత డ‌బ్బుతో 10 ట్రాక్ట‌ర్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు లారెన్స్ చెప్పారు.

అవసరంలో ఉన్న సరైన వ్యక్తులకు సేవ చేయడానికి ఈ నిస్వార్థ ప్రయాణంలో అందరూ చేరి మద్దతు ఇవ్వాల‌ని కోరారు. మాటల కంటే చేత‌లే ఎక్కువ‌గా మాట్లాడుతుంది. నా ప్ర‌యాణంలో మీ అంద‌రి మ‌ద్ద‌తు, ఆశీస్సులు కావాలి. నేటి నుంచి సేవే దేవుడు మొద‌లు అంటూ లారెన్స్ తెలిపారు.

Pushpa 2 Song : పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పుష్ప టైటిల్ సాంగ్ విన్నారా..?

ట్రెండింగ్ వార్తలు