Pushpa 2 Song : పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పుష్ప టైటిల్ సాంగ్ విన్నారా..?

తాజాగా పు సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.

Pushpa 2 Song : పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పుష్ప టైటిల్ సాంగ్ విన్నారా..?

Pushpa 2 Song : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియా పాపులర్ అయిపోయారు. దీంతో పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా పుష్ప షూటింగ్ జరుగుతుంది.

Also Read : Suhas : హీరో లిప్ లాక్ సీన్ చూసి భార్య ఏమందంటే..

ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపినెస్ ఇవ్వగా ఇటీవల పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ ప్రోమో అని పుష్ప పుష్ప.. అంటూ సాగే ఓ చిన్న వీడియోని రిలీజ్ చేశారు. అనంతరం బన్నీ స్టైలిష్ గా టక్ వేసి సిగరెట్ కాలుస్తూ ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి పుష్ప పుష్ప.. అని సాగే ఫుల్ టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.

ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇంకే రేంజ్ కి ఎదుగుతాడో చూడాలి.