×
Ad

Rahul Ramakrishna: తప్పు తెలుసుకున్నా.. ఇక నా పని నేను చేసుకుంటా.. వివాదంపై స్పందించిన రాహుల్ రామకృష్ణ

టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్ లతో సంచలనం (Rahul Ramakrishna)క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Actor Rahul Ramakrishna responds to the controversy

Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్ లతో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. “మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. డంబెల్‌ డోర్‌ వచ్చి ఈ పరిస్థితులను చక్కదిద్దాలి” అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను ట్యాగ్‌ చేస్తూ రాహుల్‌ రామకృష్ణ చేసిన కామెంట్స్‌ సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో పెద్ద(Rahul Ramakrishna) ఎత్తున దుమారమే రేగింది. దాంతో, విషయం అర్థమైన రాహుల్‌ రామకృష్ణ వెంటనే తన ఎక్స్‌ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.

War 2 OTT: ఓటీటీలోకి వస్తున్న వార్ 2.. రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

అయినప్పటికి వివాదం సద్దుమణగక పోవడంతో శనివారం తన ఎక్స్‌లో మరో పోస్ట్‌ పెట్టాడు. “నాకంటే గొప్ప మనసులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో సతమతమవుతున్నాయి. పరిపాలన గురించి నాకేం తెలుసు? నేను ఒక చిన్న నటుడిని. రాజకీయ రంగంలోని అనుభవజ్ఞులైన నాయకులతో మాట్లాడిన తరువాత నా ఆందోళన, నిరాశ తప్పని గ్రహించాను. కానీ, ఈ వ్యవస్థ గురించి మాట్లాడటం నా కర్తవ్యం. ఇక నుంచి ఈ ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నాను. ఇకపై సినిమాలపైనే నా దృష్టి పెడతాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.