Raj Tarun Issue: ఇంటిని ఖాళీ చేస్తా.. తాళం చెవిని ఈ మంత్రి తాలూకా వ్యక్తులకు 5 రోజుల్లో ఇస్తా: లావణ్య 

నిన్న సాయంత్రం మంత్రి తాలూకా వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగారు.

Lavanya

సినీనటుడు రాజ్ తరుణ్, లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రచ్చ జరుగుతున్న వేళ లావణ్య ఇవాళ 10టీవీతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపింది.

“ఒక రాజకీయ నాయకుడి తాలూకా వ్యక్తుల దగ్గర 2021లో నేను, రాజ్ తరుణ్ డబ్బులు తీసుకున్నాము. 55 లక్షల రూపాయలు మంత్రి తాలూకా వ్యక్తుల దగ్గర తీసుకున్నాము. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆ వ్యక్తి మంత్రిగా ఉన్నారు. మంత్రి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం అవసరాల దృష్ట్యా ఆ 55 లక్షల రూపాయలను ఆ మంత్రి సమక్షంలోనే తీసుకున్నాము. ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాము. రూపాయిన్నర ఇంట్రెస్ట్ చొప్పున డబ్బులు తీసుకున్నప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ కట్టడం లేదు.

నిన్న సాయంత్రం మంత్రి తాలూకా వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగారు. డబ్బులు ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని మంత్రికి సంబంధించిన వ్యక్తులను కోరాను. డబ్బులు ఇవ్వని పక్షంలో ఇంటిని అప్పచెప్పాలని మంత్రి తాలూకా వ్యక్తులు కాల్ చేశారు. నేను ఇంటిని ఖాళీ చేసి తాళం మంత్రి తాలూకా వ్యక్తులకు ఐదు రోజుల్లో ఇస్తాను” అని చెప్పింది.