Hyderabad Floods – Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు తనవంతు సాయంగా రూ. 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఐటీ, అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ KTR ను కలిసి చెక్ అందజేశారు రామ్.
రామ్ తో పాటు దర్శకుడు ఎన్.శంకర్ కూడా కేటీఆర్ ను కలిశారు. నగరప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన సినీ ప్రముఖులను అభినందించిన కేటీఆర్ యంగ్ హీరో రామ్ ను కూడా ప్రశంసించారు.
మరికొందరు సెలబ్రిటీలు కూడా వీలు చూసుకుని చెక్కులు అందించే ప్రయత్నం చేస్తున్నారు.